అత్యంత విలువైన బ్రాండ్‌గా అమెజాన్
Sakshi Education
ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా అమెరికాకు చెందిన అగ్రగామి రిటైల్ సంస్థ అమెజాన్ నిలిచింది.
అమెజాన్ బ్రాండ్ విలువ 2018లో 52 శాతం (108 బిలియన్ డాలర్ల మేర) పెరిగి 315 బిలియన్ డాలర్లకు (రూ.22.05 లక్షల కోట్లకు) చేరినట్టు అంతర్జాతీయ మార్కెట్ పరిశోధనా సంస్థ కాంటార్ తెలిపింది. ఈ మేరకు జూన్ 11 తన 2019వ సంవత్సరపు ‘100 టాప్ బ్రాండ్‌స’ నివేదికను కాంటార్ విడుదల చే సింది.
2018లో అమెజాన్ మూడో స్థానంలో ఉండగా, గూగుల్ అత్యంత విలువైన ప్రపంచపు నంబర్ 1 బ్రాండ్‌గా ఉంది. తాజాగా వీటి స్థానాలు మారిపోయాయి. అమెజాన్ రెండు మెట్లు పెకైక్కి మొదటి స్థానానికి రాగా, గూగుల్ మూడో స్థానానికి పడిపోయింది. రెండో స్థానంలో యాపిల్ నిలిచింది.
కాంటార్ ప్రపంచపు టాప్ 100 విలువైన బ్రాండ్లు
కాంటార్ ప్రపంచపు టాప్ 100 విలువైన బ్రాండ్లలో 23 ఆసియావే ఉన్నాయి. ఇందులో 15 చైనాకు చెందినవి కావడం గమనార్హం.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా అమెజాన్
ఎప్పుడు : జూన్ 11
ఎవరు : అంతర్జాతీయ మార్కెట్ పరిశోధనా సంస్థ కాంటార్
2018లో అమెజాన్ మూడో స్థానంలో ఉండగా, గూగుల్ అత్యంత విలువైన ప్రపంచపు నంబర్ 1 బ్రాండ్‌గా ఉంది. తాజాగా వీటి స్థానాలు మారిపోయాయి. అమెజాన్ రెండు మెట్లు పెకైక్కి మొదటి స్థానానికి రాగా, గూగుల్ మూడో స్థానానికి పడిపోయింది. రెండో స్థానంలో యాపిల్ నిలిచింది.
కాంటార్ ప్రపంచపు టాప్ 100 విలువైన బ్రాండ్లు
ర్యాంకు | సంస్థ | సంపద(బిలియన్ డాలర్లలో) | దేశం |
1 | అమెజాన్ | 315 | అమెరికా |
2 | యాపిల్ | 309.5 | అమెరికా |
3 | గూగుల్ | 309 | అమెరికా |
4 | మైక్రోసాఫ్ట్ | 251 | అమెరికా |
5 | వీసా సంస్థ | 178 | అమెరికా |
6 | ఫేస్‌బుక్ | 159 | అమెరికా |
7 | అలీబాబా | 131.2 | చైనా |
8 | టెన్సెంట్ | 130.9 | చైనా |
9 | మెక్ డొనాల్డ్స్ | 130.3 | అమెరికా |
10 | ఏటీ అడ్ టీ | 108.3 | అమెరికా |
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా అమెజాన్
ఎప్పుడు : జూన్ 11
ఎవరు : అంతర్జాతీయ మార్కెట్ పరిశోధనా సంస్థ కాంటార్
Published date : 12 Jun 2019 06:27PM