అత్యంత కాలుష్య భరిత నగరంగా వారణాసి
Sakshi Education
దేశంలోనే అత్యంత కాలుష్యభరిత నగరంగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి(కాశీ) నిలిచింది.
ఈ మేరకు దేశంలోని 500ల నగరాలతో రూపొందించిన వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ)ని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) అక్టోబర్ 23న విడుదల చేసింది. ఈ వాయు నాణ్యత సూచీలో 276 పాయింట్లతో వారణాసి అగ్రస్థానంలో నిలిచింది. వారణాసి తర్వాతి స్థానాల్లో వరుసగా లక్నో-269 పాయింట్లు(యూపీ), ముజఫర్‌నగర్-266 పాయింట్లు(యూపీ), యమునానగర్-264 పాయింట్లు(హరియాణ), మొరాదాబాద్- 256 పాయింట్లు(యూపీ) ఉన్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అత్యంత కాలుష్యభరిత నగరంగా వారణాసి(కాశీ)
ఎప్పుడు : అక్టోబర్ 23
ఎవరు : కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ)
ఎక్కడ : దేశంలో
క్విక్ రివ్యూ :
ఏమిటి : అత్యంత కాలుష్యభరిత నగరంగా వారణాసి(కాశీ)
ఎప్పుడు : అక్టోబర్ 23
ఎవరు : కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ)
ఎక్కడ : దేశంలో
Published date : 25 Oct 2019 05:39PM