అత్యధిక ప్రాచుర్యం పొందిన క్రికెటర్
Sakshi Education
భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రపంచంలోనే అత్యధిక ప్రాచుర్యం పొందిన క్రికెటర్ అనిసెమ్‌రష్ సంస్థ చేసిన అధ్యయనంలో వెల్లడైంది.
ఈ అధ్యయనం ప్రకారం... 2020, జనవరి నుంచి జూన్ వరకు నెలకు సగటున 16.2 లక్షల సార్లు అభిమానులు కోహ్లి పేరును ఇంటర్నెట్‌లో వెతికారు. ఆ తర్వాతి స్థానాల్లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (9.7 లక్షలు), భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని (9.4 లక్షలు) గురించి ఆరా తీశారు. వీరి తర్వాత జార్జి మకాయ్ (9.1 లక్షలు), జోష్ రిచర్డ్స్ (7.1 లక్షలు), హార్దిక్ పాండ్యా (6.7 లక్షలు), సచిన్ టెండూల్కర్ (5.4 లక్షలు), క్రిస్ మాథ్యూస్ (4.1 లక్షలు), శ్రేయస్ అయ్యర్ (3.4 లక్షలు) ఉన్నారు. మహిళా క్రికెటర్ స్మృతి మంధాన (12వ స్థానం), ఆసీస్ ప్లేయర్ ఎలీస్ పెర్రీ (20వ స్థానం) టాప్–20లో నిలిచారు.
జట్ల విభాగంలోనూ..
టీమిండియా గురించి నెలకు సగటున 2.4 లక్షల సార్లు ఆన్‌లైన్‌లో ఆరా తీశారని సెమ్‌రష్ సంస్థ పేర్కొంది. టీమిండియా తర్వాత వరుసగా ఇంగ్లండ్ (66 వేలు), ఆస్ట్రేలియా (33 వేలు), వెస్టిండీస్ (29 వేలు), పాకిస్తాన్ (23 వేలు), దక్షిణాఫ్రికా (16 వేలు), బంగ్లాదేశ్ (12 వేలు), న్యూజిలాండ్ (12 వేలు), శ్రీలంక (9 వేలు), ఐర్లాండ్ (5 వేలు), ఆఫ్గానిస్తాన్ (4 వేలు), జింబాబ్వే (3 వేలు) జట్ల గురించి అభిమానులు ఆరా తీసినట్లు అధ్యయనంలో తెలిసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అత్యధిక ప్రాచుర్యం పొందిన క్రికెటర్‌గా విరాట్కోహ్లి
ఎప్పుడు : ఆగస్టు 10
ఎవరు :సెమ్‌రష్ సంస్థ
ఎక్కడ :ప్రపంచంజట్ల విభాగంలోనూ..

Published date : 11 Aug 2020 05:43PM