ఆస్ట్రియా గ్రాండ్‌ప్రితో ఫార్ములావన్ సీజన్ ప్రారంభం
Sakshi Education
కరోనా మహమ్మారితో వాయిదా పడిన 2020 ఫార్ములావన్(ఎఫ్1) సీజన్ 2020, జూలై నెలలో ఆరంభం కానుంది.
జూలై 5న ఆస్ట్రియా గ్రాండ్‌ప్రితో తాజా సీజన్‌ను ఆరంభించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు ఎఫ్1 చీఫ్ చేజ్ క్యారీ ఏప్రిల్ 27న ప్రకటించారు. జూలై–ఆగస్టు నెలల్లో యూరప్‌లో రేసులను నిర్వహించి... అనంతరం ఆసియా, ఉత్తర, దక్షిణ అమెరికాల్లో పూర్తి చేసి డిసెంబర్‌లో మధ్య ఆసియాలో సీజన్‌ను ముగించే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. 2020, ఏడాది కనీసం 15 రేసులను నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు∙ఫ్రాన్స్ గ్రాండ్‌ప్రిని రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దాంతో ఈ ఏడాది రద్దయిన మూడో గ్రాండ్‌ప్రి జాబితాలో ఫ్రాన్స్ చేరింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, మొనాకో రేసులు రద్దవగా... మరో ఏడు వాయిదా పడ్డాయి. మరోవైపు ప్రేక్షకులు లేకుండానే ఈసారి బ్రిటిష్ గ్రాండ్‌ప్రి నిర్వహిస్తామని నిర్వాహకులు ప్రకటించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆస్ట్రియా గ్రాండ్‌ప్రితో ఫార్ములావన్ సీజన్ ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్ 27
ఎవరు : ఎఫ్1 చీఫ్ చేజ్ క్యారీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆస్ట్రియా గ్రాండ్‌ప్రితో ఫార్ములావన్ సీజన్ ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్ 27
ఎవరు : ఎఫ్1 చీఫ్ చేజ్ క్యారీ
Published date : 28 Apr 2020 07:02PM