Skip to main content

ఆస్ట్రేలియా క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో లీసా స్థాలేకర్

ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ లీసా స్థాలేకర్ ఆస్ట్రేలియన్ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకుంది.
Current Affairs
పుణేలో జన్మించి ఆస్ట్రేలియాకు వలస వెళ్లిన ఆమె 2001-13 మధ్య కాలంలో 8 టెస్టులు, 125 వన్డేలు, 54 టి20లు ఆడింది. నాలుగు ప్రపంచకప్‌లు గెలిచిన ఆస్ట్రేలియా జట్లలో ఆమె సభ్యురాలిగా ఉంది. ‘‘తాజా గౌరవంతో బెలిండా క్లార్క్, రోల్టన్, మెలానీలాంటి స్టార్ క్రికెటర్ల సరసన లీసా చేరింది’’ అని ఆస్ట్రేలియన్ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ చైర్మన్ పీటర్ కింగ్ తెలిపారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఆస్ట్రేలియన్ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న క్రికెటర్
ఎప్పుడు : ఫిబ్రవరి 5
ఎవరు : ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ లీసా స్థాలేకర్
ఎందుకు : క్రికెట్ క్రీడలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను
Published date : 15 Feb 2021 11:56AM

Photo Stories