ఆసియా అథ్లెటిక్స్‌లో చిత్రకు స్వర్ణం
Sakshi Education
ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ అథ్లెట్ చిత్ర ఉన్నికృష్ణన్ స్వర్ణ పతకం సాధించింది.
ఖతర్ రాజధాని దోహాలో ఏప్రిల్ 24న జరిగిన మహిళల 1500 మీటర్ల రేసులో చిత్ర 4 నిమిషాల 14.56 సెకన్లలో గమ్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచింది. మహిళల 200 మీటర్ల రేసులో ఒడిశా అథ్లెట్ ద్యుతీ చంద్ 23.24 సెకన్లలో గమ్యాన్ని చేరి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
మరోవైపు మహిళల 4x400 మీటర్ల రిలేలో ప్రాచి, పూవమ్మ రాజు, సరితాబెన్ గైక్వాడ్, విస్మయలతో కూడిన భారత బృందం 3ని:32.21 సెకన్లలో రేసును ముగించి రజత పతకం గెల్చుకుంది. పురుషుల 1500 మీటర్ల రేసులో అజయ్ కుమార్ సరోజ్ 3ని:43.18 సెకన్లలో గమ్యానికి చేరి రజతం సాధించాడు. ఓవరాల్‌గా భారత్‌కు ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు, ఏడు రజతాలు, ఏడు కాంస్యాలతో కలిపి మొత్తం 17 పతకాలు లభించాయి. పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం
ఎప్పుడు : ఏప్రిల్ 24
ఎవరు : చిత్ర ఉన్నికృష్ణన్
ఎక్కడ : దోహా, ఖతర్

Published date : 25 Apr 2019 05:16PM