ఆసియా అథ్లెటిక్స్ లో స్వప్నకు రజతం
Sakshi Education
ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత హెప్టాథ్లాన్ స్వప్నా బర్మన్‌కి రజత పతకం లభించింది.
ఖతార్ రాజధాని దోహాలో ఏప్రిల్ 23న జరిగిన హెప్టాథ్లాన్‌లో ఈవెంట్‌లో స్వప్న రెండో స్థానంలో నిలిచింది. లాంగ్‌జంప్, 800 మీటర్లు, 200 మీటర్లు, షాట్‌పుట్, 100 మీటర్ల హర్డిల్స్, హైజంప్, జావెలిన్ త్రో అంశాల్లో పోటీపడిన స్వప్నా బర్మన్ మొత్తం 5993 పాయింట్లు స్కోరు చేసింది. ఉజ్బెకిస్తాన్ అమ్మాయి ఎకతెరీనా వొర్నినా (6198 పాయింట్లు) స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. హెప్టాథ్లాన్‌లో మొత్తం ఏడు అంశాలు ఉంటాయి.
మరోవైపు 4X400 మీటర్ల మిక్స్‌డ్ రిలేలో మొహమ్మద్ అనస్, పూవమ్మ, విస్మయ, అరోకియా రాజీవ్‌లతో కూడిన భారత బృందం 3 నిమిషాల 16.71 సెకన్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని దక్కించుకుంది. మహిళల 10000 మీటర్ల రేసులో సంజీవని 32ని:44.96 సెకన్లలో గమ్యానికి చేరి కాంస్య పతకాన్ని గెలిచింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రజతం
ఎప్పుడు : ఏప్రిల్ 23
ఎవరు : స్వప్నా బర్మన్
ఎక్కడ : దోహా, ఖతార్

Published date : 24 Apr 2019 05:13PM