అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ బిల్లుకు ఆమోదం
Sakshi Education
కృత్రిమ గర్భధారణ, ఇతర పునరుత్పత్తికి సంబంధించిన రంగంలోని వైద్య నిపుణులు, క్లినిక్‌లను నమోదు చేసేందుకు ప్రత్యేకంగా నేషనల్ రిజిస్రీన్టి,రిజిస్ట్రేషన్ అథారిటీని ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.
ఇందుకు సంబంధించిన ‘అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ(నియంత్రణ) బిల్’కు కేంద్ర కేబెనెట్ ఫిబ్రవరి 19న ఆమోదం తెలిపింది.
బిల్లులోని ప్రతిపాదనలు...
క్విక్ రివ్యూ :
ఏమిటి : అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ(నియంత్రణ) బిల్‌కు ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : వైద్యరంగానికి సంబంధించి నేషనల్ రిజిస్రీన్టి,రిజిస్ట్రేషన్ అథారిటీని ఏర్పాటు చేసేందుకు
బిల్లులోని ప్రతిపాదనలు...
- గర్భంలోని శిశువు లింగ నిర్ధారణకు, పిండం(ఎంబ్రియొ), బీజకణం(గామెట్) అమ్మకానికి కఠిన శిక్ష విధించాలి. వీటి అక్రమ వినియోగానికి, అమ్మకానికి మొదటి సారైతే రూ. 10 లక్షలు, మరో సారి అదే నేరానికి పాల్పడితే 12 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించాలి.
- కృత్రిమ గర్భధారణ కోరుకుంటున్న దంపతులు, అందుకు సహకరిస్తున్న మహిళ కుటుంబం వివరాలను రహస్యంగా ఉంచాలి. వారి పునరుత్పత్తి హక్కులను రక్షించాలి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ(నియంత్రణ) బిల్‌కు ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : వైద్యరంగానికి సంబంధించి నేషనల్ రిజిస్రీన్టి,రిజిస్ట్రేషన్ అథారిటీని ఏర్పాటు చేసేందుకు
Published date : 20 Feb 2020 07:16PM