Skip to main content

అరుణ గ్రహానికి నాసా రోవర్ పెర్‌సెవరెన్స్

అరుణ గ్రహంపై జీవనం ఆనవాళ్లను గుర్తించే లక్ష్యంతో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఓ రోవర్‌ను ప్రయోగించింది.
Current Affairs
కేప్‌కేనర్వాల్ అంతరిక్ష కేంద్రం నుంచి జూలై 30న అట్లాస్-5 రాకెట్ ద్వారా 6 చక్రాలతో కారు పరిమాణంలో ఉన్న ‘పెర్‌సెవరెన్స్’ రోవర్‌ను నింగిలోకి ప్రయోగించింది. కెమెరాలు, మైక్రోఫోన్లు, లేజర్లు, డ్రిల్స్ వంటి అత్యాధునిక పరికరాలతో పాటు మినీ హెలికాప్టర్‌ను రోవర్‌లో అమర్చారు. రోవర్ సహాయంతో అరుణ గ్రహ నమూనాలను మళ్లీ భూమ్మీదకు తీసుకు రావాలని నాసా ప్రయత్నం చేస్తోంది. పెర్‌సెవరెన్స్ 2021, ఫిబ్రవరి 18న అరుణ గ్రహంపైకి చేరుకుంటుంది.
|
క్విక్ రివ్యూ :

ఏమిటి : అట్లాస్-5 రాకెట్ ద్వారా ‘పెర్‌సెవరెన్స్’ రోవర్ ప్రయోగం
ఎప్పుడు : జూలై 30
ఎవరు : అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)
ఎక్కడ : కేప్‌కేనర్వాల్ అంతరిక్ష కేంద్రం, అమెరికా
ఎందుకు : అరుణ గ్రహంపై జీవనం ఆనవాళ్లను గుర్తించే లక్ష్యంతో
Published date : 01 Aug 2020 11:54AM

Photo Stories