Skip to main content

అర్థశాస్త్రంలో ఇద్దరు అమెరికా ఆర్థికవేత్తలకు నోబెల్

వేలం సిద్ధాంతం, కొత్త వేలం ప్రక్రియలను కనిపెట్టినందుకు అమెరికా ఆర్థికవేత్తలు పాల్ ఆర్.మిల్‌గ్రోమ్, రాబర్ట్ బి.విల్సన్‌లకు 2020 ఏడాది ఆర్థిక నోబెల్ పురస్కారం వరించింది. ఈ మేరకు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ అక్టోబర్ 12న ప్రకటించింది. ‘
Edu newsప్రపంచవ్యాప్తంగా ప్రతిచోటా ఎన్నో రంగాల్లో వేలం ప్రక్రియలు జరుగుతుంటారుు. ఆర్థికవేత్తలు మిల్‌గ్రోమ్, రాబర్ట్ విల్సన్‌లు వేలం సిద్ధాంతాన్ని మరింత సరళీకరించడమేగాక, ఈ విధానంలో కొత్త పద్ధతులను కనిపెట్టారు. దీని వల్ల అటు విక్రయదారులు, కొనుగోలుదారులే గాక, పన్ను చెల్లింపుదారులు కూడా ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారు’ అని నోబెల్ కమిటీ పేర్కొంది.

2019లో ప్రవాస భారతీయుడికి...
ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించడానికి వినూత్న కోణంలో పరిశోధనలు చేసి ఆర్థిక రంగంలో విప్లవాత్మక మార్పుల్ని తెచ్చినందుకు ప్రవాస భారతీయుడు అభిజిత్ బెనర్జీని అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారం వరించింది. 2019 ఏడాదికి గానూ ఆర్థిక నోబెల్ పురస్కారాన్ని ముగ్గురికి ప్రకటించారు. అభిజిత్, ఆయన భార్య ఎస్తర్ డఫ్లో, మరో అమెరికన్ ఆర్థికవేత్త మైకేల్ క్రెమెర్‌లను సంయుక్తంగా ఈ అవార్డుకు ఎంపిక చేశారు. 1969 నుంచి అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి ఇస్తున్నారు. ఇప్పటివరకు 51 సార్లు ఈ అవార్డును ప్రకటించగా.. 84 మంది ఆర్థికవేత్తలు పురస్కారాన్ని అందుకున్నారు.
Published date : 12 Oct 2020 06:31PM

Photo Stories