ఆర్థిక స్వేచ్ఛా సూచీ-2020లో భారత్ ర్యాంకు?
Sakshi Education
అంతర్జాతీయ ఆర్థిక స్వేచ్ఛా సూచీ-2020లో భారత్‌కు 105వ స్థానం దక్కింది.
కెనడాకు చెందిన ఫ్రేసర్ ఇనిస్టిట్యూట్ సెప్టెంబర్ 10న ఎకనమిక్ ఫ్రీడమ్ ఆఫ్ ది వరల్డ్:2020 పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఆర్థిక స్వేచ్ఛ విషయంలో భారత్ 26 స్థానాలు కిందకు జారిపోయినట్టు నివేదిక పేర్కొంది. తదుపరి దశ సంస్కరణల అమలు, అంతర్జాతీయ వాణిజ్యానికి తలుపులు తెరవడంపైనే భారత్‌లో ఆర్థిక స్వేచ్ఛ పెరిగే అవకాశాలు ఆధారపడి ఉన్నాయని తెలిపింది.
10 పాయింట్ల స్థాయిలో ఉంటే...
భారత ప్రభుత్వం విషయంలో 8.22 నుంచి 7.16కు, న్యాయ వ్యవస్థ, ఆస్తి హక్కుల విషయంలో 5.17 నుంచి 5.06కు, అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించిన స్వేచ్ఛ విషయంలో 6.08 నుంచి 5.71కు, రుణ నియంత్రణ, కార్మిక, వ్యాపారాల విషయంలో 6.63 నుంచి 6.53కు భారత్ పరిమాణం తగ్గింది. 10 పాయింట్ల స్థాయిలో ఉంటే దాన్ని అధిక ఆర్థిక స్వేచ్ఛగా పరిగణిస్తారు. ఈ ఆర్థిక స్వేచ్ఛా సూచీలో హాంగ్‌కాంగ్, సింగపూర్ అగ్ర స్థానాల్లో నిలిచాయి. న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, యూఎస్, ఆస్ట్రేలియా, మారిషస్, జార్జియా, కెనడా, ఐర్లాండ్ మొదటి పది స్థానాల్లో ఉన్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతర్జాతీయ ఆర్థిక స్వేచ్ఛా సూచీ-2020లో భారత్‌కు 105వ స్థానం
ఎప్పుడు : సెప్టెంబర్ 10
ఎవరు : ఎకనమిక్ ఫ్రీడమ్ ఆఫ్ ది వరల్డ్:2020

Published date : 11 Sep 2020 05:19PM