ఆర్థిక శాఖ కార్యదర్శిగా సుభాష్ చంద్ర గార్గ్
Sakshi Education
కేంద్ర ఆర్థిక శాఖ నూతన కార్యదర్శిగా సుభాష్ చంద్ర గార్గ్‌ను నియమిస్తూ కేంద్ర నియామకాల మంత్రిత్వశాఖ మార్చి 8న ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో అజయ్ నారాయణ్ ఝా స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. 1983 బ్యాచ్ రాజస్తాన్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన గార్గ్ 2017 జూన్ నుంచి ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సాధారణంగా ఆర్థికశాఖలో బాధ్యతలు నిర్వహించే ఐదుగురు కార్యదర్శుల్లో అత్యంత సీనియర్‌గా ఉన్నవారే ఫైనాన్స్ కార్యదర్శిగా నియమితులవుతారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేంద్ర ఆర్థిక శాఖ నూతన కార్యదర్శి నియామకం
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : సుభాష్ చంద్ర గార్గ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేంద్ర ఆర్థిక శాఖ నూతన కార్యదర్శి నియామకం
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : సుభాష్ చంద్ర గార్గ్
Published date : 09 Mar 2019 05:30PM