ఆర్థిక అసమానతలపై ఆక్స్‌ఫామ్ నివేదిక విడుదల
Sakshi Education
ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్న నేపథ్యంలో సామాన్యుల పక్షం వహించాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ మానవ హక్కుల సంస్థ ఆక్స్‌ఫామ్ ఒక నివేదికను రూపొందించింది.
వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 50వ వార్షిక సమావేశాలు ప్రారంభం కానున్న సందర్భంగా ’టైమ్ టు కేర్’ పేరిట ఆక్స్‌ఫామ్ జనవరి 20న ఈ నివేదికను విడుదల చేసింది.
టైమ్ టు కేర్‌లోని ప్రధానాంశాలు..
టైమ్ టు కేర్‌లోని ప్రధానాంశాలు..
- {పపంచ జనాభాలో సుమారు 60 శాతం (460 కోట్లు) ప్రజలకు మించిన సంపద 2,153 మంది బిలియనీర్ల దగ్గర ఉంది.
- మొత్తం ఆఫ్రికాలో మహిళల దగ్గరున్న సంపద కన్నా ప్రపంచంలో టాప్ 22 మంది బిలియనీర్ల వద్ద ఉన్న సంపదే ఎక్కువ.
- భారతదేశ జనాభాలో 70 శాతం (సుమారు 95.3 కోట్ల మంది) జనాభాతో పోలిస్తే 1 శాతం కుబేరుల సంపద ఏకంగా నాలుగు రెట్లు పైగా ఉంది. దేశీయంగా 63 మంది బిలియనీర్ల మొత్తం సంపద విలువ.. పూర్తి ఆర్థిక సంవత్సర బడ్జెట్ పరిమాణాన్ని (2018-19లో రూ. 24.42 లక్షల కోట్లు) మించింది.
- మహిళలు, బాలికలు రోజుకు 326 కోట్ల గంటల పనిని ఎలాంటి భత్యాలు లేకుండా చేస్తున్నారు. దీనికి లెక్కగడితే ఏటా రూ. 19 లక్షల కోట్లవుతుంది. ఇది 2019లో దేశీ విద్యారంగానికి కేటాయించిన మొత్తం బడ్జెట్ (రూ. 93,000 కోట్లు)కు 20 రెట్లు ఎక్కువ.
- సంక్షేమ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు పెంచడంద్వారా 1.1 కోట్ల మేర కొత్త ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. తద్వారా 2018లో కోల్పోయిన 1.1 కోట్ల ఉద్యోగాలను తిరిగి సృష్టించవచ్చు.
- వచ్చే 10 ఏళ్ల పాటు ఒక్క శాతం కుబేరులు తమ సంపదపై అదనంగా కేవలం 0.5 శాతం పన్ను చెల్లించిన పక్షంలో.. వృద్ధులు, బాలల సంక్షేమం, విద్యా, వైద్యం వంటి రంగాల్లో 11.7 కోట్ల పైచిలుకు ఉద్యోగాల కల్పనకు అవసరమైన పెట్టుబడులకు సరిసమానంగా ఉంటుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : టైమ్ టు కేర్ పేరుతో నివేదిక విడుదల
ఎప్పుడు : జనవరి 20
ఎవరు : మానవ హక్కుల సంస్థ ఆక్స్‌ఫామ్
ఎందుకు : ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్న నేపథ్యంలో
మాదిరి ప్రశ్నలు
ఏమిటి : టైమ్ టు కేర్ పేరుతో నివేదిక విడుదల
ఎప్పుడు : జనవరి 20
ఎవరు : మానవ హక్కుల సంస్థ ఆక్స్‌ఫామ్
ఎందుకు : ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్న నేపథ్యంలో
మాదిరి ప్రశ్నలు
1. యూఎన్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ (UNEP) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1. న్యూయార్క్
2. నైరోబీ
3. రోమ్
4. లుసాకా
- View Answer
- సమాధానం: 2
Published date : 21 Jan 2020 06:25PM