ఆర్మీలో 575 మంది కశ్మీర్ యువకులు
Sakshi Education
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ చెందిన 575 మంది యువకులు భారత సైన్యంలో చేరారు. వారు ఏడాది శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా ఆగస్టు 31న స్థానిక బానా సింగ్ మైదానంలో పరేడ్ నిర్వహించారు.
జమ్మూ కశ్మీర్ లైట్ ఇన్‌ఫాంట్రీ బెటాలియన్‌లో పని చేసేందుకు వీరిని నియమించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. లెఫ్టినెంట్ జనరల్ అశ్వనీ కుమార్ ఈ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. దేశానికి సేవ చేయాలనే తపన కశ్మీర్ యువకుల్లో కనపడిందని ఆయన తెలిపారు. తమ కుమారులు ఆర్మీలో పని చేయడం గర్వంగా ఉందని ఈ సందర్భంగా కొందరు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఇండియన్ ఆర్మీలోకి 575 మంది కశ్మీర్ యువకులు
ఎప్పుడు: ఆగస్టు 31, 2019
ఎవరు: కశ్మీర్ యువకులు
ఎక్కడ: జమ్మూ& కశ్మీర్
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఇండియన్ ఆర్మీలోకి 575 మంది కశ్మీర్ యువకులు
ఎప్పుడు: ఆగస్టు 31, 2019
ఎవరు: కశ్మీర్ యువకులు
ఎక్కడ: జమ్మూ& కశ్మీర్
Published date : 03 Sep 2019 06:20PM