Skip to main content

ఆర్మేనియా, అజర్‌బైజాన్‌ల మధ్య శాంతి ఒప్పందం

అజర్ బైజాన్‌లోని నాగోర్నో-కారాబాఖ్ ప్రాంతంపై ఆధిపత్యం కోసం ఘర్షణ పడుతోన్న ఆర్మేనియా, అజర్‌బైజాన్‌లు ఘర్షణలకు స్వస్తి పలుకుతూ నవంబర్ 10న శాంతి ఒప్పందం చేసుకున్నాయి.
Current Affairs
ఈ ఒప్పందంలో భాగంగా రష్యా నుంచి 2000 మంది రష్యన్ శాంతి దళాలను వివాదాస్పద ప్రాంతంలో ఐదేళ్ళ పాటు మోహరించాలని తీర్మానించారు. అలాగే ఆర్మేనియాకు చెందిన భద్రతా బలగాలు నాగర్నో కారాబఖ్ సరిహద్దులోని ప్రాంతాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది.

శతాబ్దాలుగా వివాదం...
నాగోర్నో-కారాబాఖ్ అనే ప్రాంతంపై పట్టుకోసం అజర్‌బైజాన్, ఆర్మేనియా దేశాలు కత్తులు దూసుకుంటున్నాయి. శతాబ్దాలుగా ఈ వివాదం కొనసాగుతోంది. ఈ ప్రాంతం భౌగోళికంగా అజర్‌బైజాన్‌లో ఉన్నప్పటికీ.. దానిపై ఆర్మేనియా ఆధిపత్యం వహిస్తోంది.

1994 సంధి ప్రకారం...
1994లో కుదిరిన యుద్ధ విరమణ సంధి ప్రకారం... నాగోర్నో-కారాబాఖ్ ప్రాంతం ఆర్మేనియా దళాల నియంత్రణలో ఉంది. అంతకు ముందు జరిగిన యుద్ధంలో 30,000 మంది చనిపోయారు. అప్పటి నుంచి, అప్పుడప్పుడు కొన్ని ఘర్షణలు జరిగినప్పటికీ, పూర్తి స్థాయి యుద్ధం 2020, సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం అయి్యంది. ఈ యుద్ధంలో 400కుపైగా మరణించారు. అనేక సార్లు కాల్పుల విరమణకు పిలుపునిచ్చినప్పటికీ అవి అమలు కాలేదు. వ్యూహాత్మక నగరం సుషిని అజర్‌బైజాన్ తన అదుపులోకి తెచ్చుకుంది. దీనితో తాజ ఒప్పందం కుదిరినట్లు భావిస్తున్నారు.

ఆర్మేనియా రాజధాని: యెరెవాన్
కరెన్సీ: ఆర్మేనియన్ డ్రామ్
అజర్ బైజాన్ రాజధాని: బాకు
కరెన్సీ: అజర్‌బైజానీ మానట్

క్విక్ రివ్యూ :

ఏమిటి : శాంతి ఒప్పందం
ఎప్పుడు : నవంబర్ 10
ఎవరు : ఆర్మేనియా, అజర్‌బైజాన్‌ల
ఎందుకు : నాగోర్నో-కారాబాఖ్ ప్రాంతం విషయంలో ఆర్మేనియా, అజర్‌బైజాన్ మధ్య ఘర్షణలకు స్వస్తి పలికేందుకు
Published date : 12 Nov 2020 05:35PM

Photo Stories