అరేబియా సముద్రంలో మహా తుపాను
Sakshi Education
అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపానుకు ‘మహా’గా పేరు పెట్టారు.
ఈ తుపాను లక్షదీవులకు ఉత్తర ఈశాన్య దిశగా 130 కి.మీ, కోజికోడ్‌కి పశ్చిమ వాయువ్య దిశగా 340 కి.మీ దూరంలో కొనసాగుతూ గంటకు 18 కి.మీ వేగంతో కదులుతోందని భారత వాతవరణ శాఖ(ఐఎండీ) అక్టోబర్ 31న వెల్లడించింది. తీవ్రరూపం దాల్చుతున్న మహా ప్రభావంతో కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు, లక్షదీవులను వర్షాలు ముంచెత్తనున్నాయి.
మరోవైపు పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలో కొనసాగుతున్న క్యార్ తుపాను క్రమంగా బలహీనపడనుందని ఐఎండీ తెలిపింది. అరేబియా సముద్రంలో ఒకేసారి రెండు తుపాన్లు ఏర్పడటం అరుదు. 1965వ సంవత్సరం తర్వాత ఇప్పుడు మళ్లీ ఇలా ఒకేసారి రెండు తుపాన్లు ఏర్పడ్డాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అరేబియా సముద్రంలో మహా తుపాను
ఎప్పుడు : అక్టోబర్ 31
ఎవరు : భారత వాతవరణ శాఖ(ఐఎండీ)
ఎక్కడ : లక్షదీవులకు ఉత్తర ఈశాన్య దిశగా 130 కి.మీ, కోజికోడ్‌కి పశ్చిమ వాయువ్య దిశగా 340 కి.మీ దూరంలో

Published date : 01 Nov 2019 05:26PM