ఆర్‌బీఐ నుంచి తెలంగాణకు 2 వేల కోట్ల రుణం
Sakshi Education
లాక్‌డౌన్ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 20న మరో రూ.2 వేల కోట్లను రుణంగా తీసుకుంది.
స్టేట్ డెవలప్‌మెంట్ లోన్స్ (ఎస్‌డీఎల్) కింద బాండ్ల అమ్మకాలు, సెక్యూరిటీల ద్వారా ఈ రుణాన్ని పొందింది. మొత్తం 6 రాష్ట్రాలు ఆర్‌బీఐ నిర్వహించిన వేలంలో పాల్గొన్నాయి. రాష్ట్రం తీసుకున్న రుణంలో వెయ్యి కోట్ల రూపాయలను 2026కు, మరో రూ.వెయ్యి కోట్లను 2028 వరకు చెల్లించాల్సి ఉంటుంది. 2020, ఏప్రిల్ 13వ తేదీన కూడా ప్రభుత్వం బాండ్ల అమ్మకాల ద్వారా రూ.2 వేల కోట్లు ఆర్‌బీఐ నుంచి అప్పుగా తీసుకుంది. దీంతో ఏప్రిల్ నెలలోనే రూ.4 వేల కోట్ల రుణం తీసుకున్నట్లు అయింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆర్‌బీఐ నుంచి 2 వేల కోట్ల రుణం
ఎప్పుడు : ఏప్రిల్ 20
ఎవరు : తెలంగాణ
ఎందుకు : లాక్‌డౌన్ నేపథ్యంలో
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆర్‌బీఐ నుంచి 2 వేల కోట్ల రుణం
ఎప్పుడు : ఏప్రిల్ 20
ఎవరు : తెలంగాణ
ఎందుకు : లాక్‌డౌన్ నేపథ్యంలో
Published date : 22 Apr 2020 06:32PM