ఆఫ్రికా దేశాలకు తెలంగాణ విత్తనాలు
Sakshi Education
తెలంగాణ విత్తనాలను ఆఫ్రికా దేశాలకు దిగుమతి చేసుకుంటామని బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ తెలిపింది.
ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథితో గేట్స్ ఫౌండేషన్ సీనియర్ ప్రోగ్రాం ఆఫీసర్ లారెన్‌గుడ్ మార్చి 4న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లారెన్‌గుడ్ మాట్లాడుతూ.. తెలంగాణ విత్తనాలు ఆఫ్రికా దేశాలకు అనుకూలంగా ఉంటాయని అన్నారు. తెలంగాణ నుంచి వరి, పొద్దుతిరుగుడు విత్తనాలు దిగుమతి చేసుకుంటామని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయరంగ అభివృద్ధికి బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ అనే సంస్థ పనిచేస్తున్న సంగతి తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆఫ్రికా దేశాలకు తెలంగాణ విత్తనాలు
ఎప్పుడు : మార్చి 4
ఎవరు : బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆఫ్రికా దేశాలకు తెలంగాణ విత్తనాలు
ఎప్పుడు : మార్చి 4
ఎవరు : బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్
Published date : 05 Mar 2019 05:02PM