Skip to main content

అఫ్గానిస్తాన్‌లో డొనాల్డ్ ట్రంప్ పర్యటన

థ్యాంక్స్ గివింగ్ రోజును పురస్కరించుకొని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నవంబర్ 28న అఫ్గానిస్థాన్‌లో ఆకస్మికంగా పర్యటించారు.
Current Affairsఅఫ్గాన్‌లోని బగ్రామ్ వైమానిక క్షేత్రంలో అమెరికా సైనికులను కలుసుకున్నారు. అనంతరం ట్రంప్ మాట్లాడుతూ... ‘తాలిబన్లు ఒప్పందం కుదుర్చుకోవాలని అనుకుంటున్నారు. మేం వారితో సమావేశమవుతున్నాం. కాల్పులను విరమించాలని చెబుతున్నాం. గతంలో అందుకు వారు అంగీకరించలేదు. ఇప్పుడు మాత్రం సరేనంటున్నారు. కాబట్టి సానుకూల ఫలితం ఉంటుందనుకుంటున్నా’’ అని చెప్పారు. అఫ్గాన్‌లో చోటుచేసుకున్న ఆత్మాహుతి దాడిలో అమెరికా సైనికుడు ఒకరు మృత్యువాతపడటంతో తాలిబన్లతో శాంతి చర్చలను రద్దు చేస్తున్నట్లు 2019, సెప్టెంబరు 8న ట్రంప్ ప్రకటించారు.

అఫ్గాన్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో భాగంగా అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీతో ట్రంప్ భేటీ అయ్యారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అఫ్గానిస్థాన్‌లో పర్యటన
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
Published date : 30 Nov 2019 05:58PM

Photo Stories