అఫ్గాన్ అభివృద్దికి కేటాయించిన సాయాన్ని నిలిపివేసిన దేశం?
Sakshi Education
2021లో అఫ్గాన్ అభివృద్దికి కేటాయించిన 25 కోట్ల యూరోల సాయాన్ని నిలిపివేస్తున్నట్లు ఆగస్టు 17న జర్మనీ ప్రకటించింది.
అయితే మానవతా సాయం, రక్షణ సేవలకు అందించే సాయాన్ని మాత్రం కొనసాగిస్తామని తెలిపింది. అఫ్గాన్‌కు అందించే సాయాన్ని తగ్గిస్తామని స్వీడన్ మంత్రి పర్ ఆల్సన్ ఫ్రిడ్ చెప్పారు.
భారతీయ సిబ్బంది వెనక్కి
తాలిబన్ల వశమైన అఫ్గాన్‌లో పరిస్థితులు దారుణంగా మారడంతో కాబూల్‌లో భారత రాయబారిని, ఇతర దౌత్య సిబ్బందిని భారత ప్రభుత్వం సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చింది. భారత వైమానిక దళానికి చెందిన సి–17 రవాణా విమానంలో మొత్తం 150 మందిని తీసుకువచ్చారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని హిండెన్ విమానాశ్రయంలో ఆగస్టు 17న ఈ విమానం ల్యాండయింది. అంతకు ముందే మరో విమానంలో 40 మంది భారత్‌కి చేరుకున్నారు. దీంతో అఫ్గాన్ నుంచి దౌత్య సిబ్బంది తరలింపు పూర్తయిందని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇప్పుడు తమ దృష్టి అంతా అక్కడున్న భారతీయుల్ని తీసుకురావడంపైనే ఉందని స్పష్టం చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021లో అఫ్గాన్ అభివృద్దికి కేటాయించిన 25 కోట్ల యూరోల సాయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన దేశం?
ఎప్పుడు : ఆగస్టు 17
ఎవరు : జర్మనీ
ఎందుకు : తాలిబన్ల వశమైన అఫ్గాన్‌లో పరిస్థితులు దారుణంగా మారడంతో...

Published date : 19 Aug 2021 06:29PM