Skip to main content

అనుమతి లేకుండా భారత జలాల్లోకి వచ్చిన క్షిపణి విధ్వంసక నౌక?

భారతదేశం నుంచి ముందస్తు అనుమతి లేకుండానే... లక్షద్వీప్‌ సమీపంలోని భారతీయ జలాల్లో ‘ఫ్రీడమ్‌ ఆఫ్‌ నేవిగేషన్‌ ఆపరేషన్‌(ఎఫ్‌ఓఎన్‌ఓపీ)’ను నిర్వహించామని ఏప్రిల్‌ 7న అమెరికా ప్రకటించింది.
Current Affairs
క్షిపణి విధ్వంసక నౌక ‘‘జాన్‌ పాల్‌ జోన్స్‌’’ భారతీయ జలాల్లో ఫ్రీడమ్‌ ఆఫ్‌ నేవిగేషన్‌ ఆపరేషన్‌లో పాల్గొందని తెలిపింది. తద్వారా ఆ జలాల పరిధిపై భారతదేశం పేర్కొంటున్న మితిమీరిన హక్కును సవాలు చేశామని పేర్కొంది. లక్షద్వీప్‌కు పశ్చిమంగా 130 నాటికల్‌ మైళ్ల దూరంలో, భారత ఈఈజెడ్‌ పరిధిలో ఎఫ్‌ఓఎన్‌ఓపీ నిర్వహించామని అమెరికా నౌకాదళానికి చెందిన 7వ ఫ్లీట్‌ ప్రకటించింది.

తీవ్రంగా స్పందించిన భారత్‌...
పర్షియన్‌ గల్ఫ్‌ నుంచి మలక్కా సంధి వరకు అమెరికా నిర్వహించిన ఎఫ్‌ఓఎన్‌ఓపీపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. దేశాల ప్రత్యేక ఆర్థిక ప్రాంతాలు(ఈఈజెడ్‌), కాంటినెంటల్‌ జోన్‌ల పరిధిలో ఇతర దేశాలు.. అనుమతి లేకుండా కార్యకలాపాలు చేపట్టడం, ముఖ్యంగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు వినియోగించడం ‘యూఎన్‌ కన్వెన్షన్‌ ఆన్‌ ది లా ఆఫ్‌ ది సీ’కి వ్యతిరేకమని పేర్కొంది. భారతీయ ఈఈజెడ్‌ పరిధిలో ఇతర దేశాలు మిలటరీ ఆపరేషన్లు నిర్వహించాలంటే తమ అనుమతి తప్పనిసరి అన్న భారత వాదనను అమెరికా కొట్టివేస్తోంది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : అనుమతి లేకుండా భారత జలాల్లోకి వచ్చిన క్షిపణి విధ్వంసక నౌక?
ఎప్పుడు : ఏప్రిల్‌ 7
ఎవరు : జాన్‌ పాల్‌ జోన్స్‌(అమెరికా)
ఎక్కడ : లక్షద్వీప్‌ సమీపం, భారత జలాలు
ఎందుకు : ఈఈజెడ్‌ జలాల పరిధిపై భారతదేశం పేర్కొంటున్న మితిమీరిన హక్కును సవాలు చేసేందుకు
Published date : 10 Apr 2021 06:25PM

Photo Stories