అనంతపురంలో ఇండోస్పేస్ లాజిస్టిక్ పార్క్
Sakshi Education
ముంబైకి చెందిన గ్రేడ్-ఏ ఇండస్ట్రియల్, లాజిస్టిక్ పార్క్స్ డెవలపర్ ఇండోస్పేస్ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో భారీ లాజిస్టిక్ పార్క్‌ను ఏర్పాటు చేయనుంది.
30 ఎకరాల్లో ఈ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు జనవరి 2న కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అనంతపురంతో పాటూ గుజరాత్‌లోని బెచరాజీ మండల్ స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్‌లో 40 ఎకరాల్లో, హరియాణాలోని సోహ్న టౌరూలో 50 ఎకరాల్లో లాజిస్టిక్ పార్క్‌లను నెలకొల్పనున్నట్లు పేర్కొన్నారు. ఇండోస్పేస్‌ను సింగపూర్ ప్రధాన కేంద్రంగా ఉన్న రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ ఎవర్‌స్టోన్ గ్రూప్ ప్రమోట్ చేస్తుంది. ప్రస్తుతం ఇండోస్పేస్‌కు పంజాబ్, హరియాణా, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ వంటి 9 రాష్ట్రాల్లో 3.45 కోట్ల చ.అ. విస్తీర్ణంలో 34 ఇండస్ట్రియల్, లాజిస్టిక్ పార్క్‌లున్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండోస్పేస్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 2
ఎక్కడ : అనంతపురం, ఆంధ్రప్రదేశ్
మాదిరి ప్రశ్నలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండోస్పేస్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 2
ఎక్కడ : అనంతపురం, ఆంధ్రప్రదేశ్
మాదిరి ప్రశ్నలు
1. అనంతపురం జిల్లాలో ఏ కంపెనీకి చెందిన ఎలక్టిక్ ్రబస్సుల తయారీ యూనిట్ ఏర్పాటు కానుందని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి 2019, నవంబర్ 1న తెలిపారు.
1. టాటా మోటార్స్
2. వీర వాహన ఉద్యోగ్ లిమిటెడ్
3. ఒలె క్ట్రా
4. ఆస్ట్రా బస్
- View Answer
- సమాధానం : 2
2. నౌకాదళ విభాగంలో ప్రతిష్టాత్మకమైన మిలాన్ (బహుపాక్షిక నావికా విన్యాసాలు)కు తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లోని ఏ నగరం వేదికైంది?
1. విజయవాడ
2. కాకినాడ
3. విశాఖపట్నం
4. నెల్లూరు
- View Answer
- సమాధానం : 3
Published date : 03 Jan 2020 05:48PM