Skip to main content

అంతర్జాతీయ సైబర్ ఒప్పందం రూపకల్పన

ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలు అధికమవుతుండడంతో వాటిని నిరోధించడానికి ఒక కొత్త అంతర్జాతీయ ఒప్పందాన్ని ఐక్యరాజ్య సమితి(ఐరాస) రూపొందిస్తోంది.
Current Affairsదీనికి సంబంధించిన తీర్మానాన్ని డిసెంబర్ 27న ఐరాస సర్వ ప్రతినిధుల సభ ఆమోదించింది. ఈ తీర్మానాన్ని యూరోపియన్ యూనియన్, అమెరికా, మరికొన్ని దేశాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. యూఎన్‌లో ఈ తీర్మానం 79-60 ఓట్ల తేడాతో గట్టెక్కింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు చెందిన నిపుణులతో ఒక కమిటీ వేసి సైబర్ నేరాలు నిరోధించడానికి కసరత్తు జరుగుతుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అంతర్జాతీయ సైబర్ ఒప్పందం రూపకల్పన
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : ఐక్యరాజ్య సమితి(ఐరాస)
ఎందుకు : ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలు అధికమవుతుండడంతో వాటిని నిరోధించడానికి
Published date : 30 Dec 2019 06:06PM

Photo Stories