అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన లెఫ్టార్మ్ పేసర్?
Sakshi Education
పాకిస్తాన్ లెఫ్టార్మ్ పేసర్ మొహమ్మద్ ఆమిర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పెట్టే మానసిక క్షోభ భరించలేకే క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు డిసెంబర్ 17న 29 ఏళ్ల ఆమిర్ ఓ వీడియో మెసేజ్‌లో వెల్లడించాడు.
నాణ్యమైన పేసర్‌గా కెరీర్ తొలినాళ్లలోనే కితాబు అందుకున్న ఈ క్రికెటర్ ప్రతిభాపాఠవాలను ‘స్పాట్ ఫిక్సింగ్’ మసకబార్చింది. 2010లో ఇంగ్లండ్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడటంతో ఐదేళ్ల నిషేధానికి (2010-2015)కు గురయ్యాడు.
ఆమిర్ అంతర్జాతీయ కెరీర్‌లో 36 టెస్టులాడి 119 వికెట్లు తీశాడు. 61 వన్డేల్లో 81 వికెట్లు, 50 టి20ల్లో 59 వికెట్లను పడగొట్టాడు. 2009లో టి20 ప్రపంచకప్ నెగ్గిన పాకిస్తాన్ జట్టు సభ్యుడు. నిషేధం తర్వాత 2017లో చాంపియన్స్ ట్రోఫీ విజయంలోనూ ఆమిర్ కీలకపాత్ర పోషించాడు. ఆ టోర్నీ ఫైనల్లో భారత్‌పై పాక్ గెలిచింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటన
ఎప్పుడు : డిసెంబర్ 17
ఎవరు : పాకిస్తాన్ లెఫ్టార్మ్ పేసర్ మొహమ్మద్ ఆమిర్
ఎందుకు : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పెట్టే మానసిక క్షోభ కారణంగా

Published date : 18 Dec 2020 06:48PM