Skip to main content

అంతరిక్షం నుంచి భూమికి చేరిన క్రిస్టినా కోచ్

అంతరిక్షంలో సుదీర్ఘ కాలం గడిపిన నాసా మహిళా వ్యోమగామి క్రిస్టినా కోచ్ ఫిబ్రవరి 6న సురక్షితంగా భూమికి చేరుకున్నారు.
Current Affairsరష్యన్ స్పేస్ ఏజన్సీకి చెందిన సోయజ్ కమాండర్ అలెగ్జాండర్ స్కొవొర్ట్ సోక్, యూరోపియన్ స్పేస్ ఏజన్సీకి చెందిన ల్యూకా పర్మిటానోతో కలిసి ఆమె కజకిస్తాన్‌లోని ఓ మారుమూల పట్టణంలో దిగారు. క్రిస్టినా 2019, మార్చి 14న మరో ఇద్దరు వ్యోమగాములతో కలిసి రోదసి ప్రయాణం ప్రారంభించింది. తన రోదసి యానంలో ఆమె ఆరు స్పేస్ వాక్‌లు చేసింది. అంతరిక్ష కేంద్రం బయట 42 గంటల 15 నిముషాలు గడిపింది.

ఒకే మిషన్‌లో ఎక్కువ కాలం...
ఒకే మిషన్‌లో ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉన్న మహిళా వ్యోమగామిగా నాసా ఫ్లైట్ ఇంజనీర్ క్రిస్టినా కోచ్ రికార్డు నెలకొల్పారు. 2019, డిసెంబర్ 28 నాటికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్)లో 289 రోజులను ఆమె పూర్తి చేసుకున్నారు. తద్వారా పెగ్గీ విట్సన్ పేరిట ఉన్న రికార్డును (288) అధిగమించారు. 2019, మార్చి 14న అంతరిక్షానికి వెళ్లిన కోచ్.. 2020 ఫిబ్రవరి 6న భూమిపైకి తిరిగి వచ్చారు.

2019, అక్టోబర్‌లో మరో మహిళా వ్యోమగామి జెప్సికా మీర్‌తో కలసి స్పేస్ వాక్ చేసిన క్రిస్టినా.. ‘ఫస్ట్ ఆల్ ఉమెన్ స్పేస్ వాక్’రికార్డును కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

చదవండి : మహిళల స్పేస్‌వాక్ విజయవంతం
Published date : 08 Feb 2020 06:08PM

Photo Stories