ఆండ్రాయిడ్ ఫోన్లకు బ్లాక్‌రాక్ మాల్‌వేర్ ముప్పు
Sakshi Education
స్మార్ట్‌ఫోన్ల నుంచి బ్యాంకింగ్ తదితర వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించేందుకు ‘బ్లాక్‌రాక్’ పేరుతో ఓ మాల్‌వేర్ చలామణిలో ఉందని సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్.ఇన్) జూలై 30న హెచ్చరించింది.
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోని దాదాపు 337 అప్లికేషన్ల నుంచి ఈ మాల్‌వేర్ సమాచారాన్ని సేకరించగలదని, ఈమెయిల్, ఈకామర్స్, సోషల్‌మీడియా, బ్యాంకింగ్ ఆప్స్ కూడా ఇందులో ఉన్నాయని పేర్కొంది. బ్లాక్‌రాక్‌ను క్సెరెక్స్ బ్యాంకింగ్ మాల్‌వేర్ సోర్స్‌కోడ్ ఆధారంగా తయారు చేశారని ఈ క్సెరెక్స్ అనేది లోకిబోట్ ఆండ్రాయిడ్ ట్రోజాన్ అని సెర్ట్ తెలిపింది. ఈ ట్రోజన్ వైరస్ ఇప్పటికే ప్రపంచమంతా చక్కర్లు కొడుతోందని వివరించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్లాక్‌రాక్ పేరుతో మాల్‌వేర్
ఎప్పుడు : జూలై 30
ఎవరు : ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్.ఇన్)
ఎక్కడ : ప్రపంచం
ఎందుకు : స్మార్ట్‌ఫోన్ల నుంచి బ్యాంకింగ్ తదితర వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించేందుకుక్విక్ రివ్యూ :
ఏమిటి : బ్లాక్‌రాక్ పేరుతో మాల్‌వేర్
ఎప్పుడు : జూలై 30
ఎవరు : ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్.ఇన్)
ఎక్కడ : ప్రపంచం
Published date : 01 Aug 2020 11:49AM