Skip to main content

అమెరికన్ బ్లాక్స్ నుంచి తొలి కార్డినల్‌గా ఎవరిని నియమించారు?

వాషింగ్టన్‌కు చెందిన ఆర్చ్ బిషప్ విల్టన్ గ్రెగోరీని పోప్ ఫ్రాన్సిస్ రోమన్ క్యాథలిక్ చర్చ్ మతాధిపతి (కార్డినల్)గా నియమించారు.
Current Affairs

విల్టన్ గ్రెగోరీ ఈ పదవి అధిరోహించిన మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికన్. గతంలో ఇతర నల్లజాతీయులు కార్డినల్స్‌గా పనిచేసినప్పటికీ, గ్రెగోరీ మాత్రమే మొట్టమొదటి అమెరికన్ జాతీయుడు. ఈ చర్య అమెరికాలోని క్యాథలిక్ నల్లజాతీయుల పురోగతికి గొప్ప ముందడుగని గ్రెగోరీ వ్యాఖ్యానించారు. అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్‌ని పోలీసులు చంపివేసిన తరువాత నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో గ్రెగోరీ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. జాతి వివక్ష వ్యతిరేక ప్రదర్శనలు జరుగుతున్న సందర్భంలో వాషింగ్టన్ డీసీలోని క్యాథలిక్ చర్చికి డొనాల్డ్ ట్రంప్ సందర్శన ప్రయత్నాన్ని గ్రెగోరీ అడ్డుకోవడంతో ఆయన తొలిసారి వార్తల్లోకెక్కారు. కాగా, వాటికన్ వేడుకలకు హాజరైన 12 మందికి కార్డినల్ హోదాను పోప్ ప్రదానం చేసి, ఆ హోదాను ప్రతిబింబించే ఉంగరం, ఎర్రటోపీ బహూకరించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : వాషింగ్టన్ రోమన్ క్యాథలిక్ చర్చ్ మతాధిపతి (కార్డినల్)గా మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికన్ విల్టన్ గ్రెగోరీ నియామకం
ఎప్పుడు : నవంబర్ 29

Published date : 30 Nov 2020 04:48PM

Photo Stories