అమెరికాలోని ఏ పోస్టాఫీసుకు ఒక ఇండో అమెరికన్ పేరు పెట్టారు?
Sakshi Education
అమెరికాలోని హూస్టన్‌లో 315 ఆడిక్స్ హావెల్ రోడ్‌లో ఉన్న పోస్టాఫీసుకు సిక్కు పోలీసు ఆఫీసర్ ‘సందీప్ సింగ్ ధలివల్’ పేరు పెట్టారు.
ఇందుకు సంబధించిన తీర్మానాన్ని యూఎస్ సెనేట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్ 2020, సెప్టెంబర్‌లోనే ఈ తీర్మానాన్ని ఆమోదించింది. దీంతో హావెల్ రోడ్‌లోని పోస్టాపీసును ‘‘డిప్యుటీ సందీప్ సింగ్ ధలివల్ పోస్టాఫీస్ బిల్డింగ్’’గా మార్చనున్నారు. సందీప్ సింగ్ 2019లో డ్యూటీలో ఉండగా హత్యకు గురయ్యారు.
రెండో సారి...
ఒక ఇండో అమెరికన్ పేరును అమెరికాలో పోస్టాఫీసుకు పెట్టడం ఇది రెండో సారి. 2006లో అమెరికా రాజకీయవేత్త దలీప్ సింగ్ పేరును దక్షిణ కాలిఫోర్నియాలో పోస్టాఫీసుకు పెట్టారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : హూస్టన్‌లోని పోస్టాఫీసుకు ఇండో అమెరికన్ డిప్యుటీ సందీప్ సింగ్ ధలివల్ పేరు
ఎప్పుడు : డిసెంబర్ 5
ఎవరు : అమెరికా ప్రభుత్వం
ఎక్కడ : అమెరికాలోని హూస్టన్‌లో 315 ఆడిక్స్ హావెల్ రోడ్‌లో ఉన్న
ఎందుకు : 2019లో డ్యూటీలో ఉండగా హత్యకు గురైన డిప్యుటీ సందీప్ సింగ్ ధలివల్కు గౌరవార్థంగా

Published date : 07 Dec 2020 05:43PM