Skip to main content

అమెరికా ఉపాధ్యక్షురాలిగా భారత సంతతి మహిళ

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2020లో డెమొక్రాటిక్ పార్టీ తరపున ఉపాధ్యక్ష పదవి బరిలో నిలిచిన భారత సంతతి మహిళ కమలా దేవి హ్యారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టబోతున్నారు.
Current Affairs

ఈ ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ విజయం సాధించడంతో ఇది సాధ్యమైంది. దీంతో అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టనున్న తొలి మహిళగా, తొలి నల్లజాతి అమెరికన్‌గా, తొలి ఇండో-అమెరికన్‌గా, తొలి ఆసియా-అమెరికన్ మహిళగా కమల రికార్డు నెలకొల్పారు.

కమలా గురించి...

  • కమలా హ్యారిస్ 1964 అక్టోబర్ 20న అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం ఒక్లాండ్‌లో జన్మించారు.
  • ఆమె తల్లి శ్యామలా గోపాలన్ తమిళనాడులోని సంప్రదాయ కుటుంబానికి చెందినవారు. తండ్రి జమైకా దేశస్తుడు డొనాల్డ్ హ్యారిస్.
  • వాషింగ్టన్ డీసీలోని హోవార్డ్ యూనివ ర్సిటీలో కమల చదువుకున్నారు.
  • యూసీ హేస్టింగ్స్ కాలేజీలో న్యాయ విద్య అభ్యసించారు.
  • అలమెండా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయంలో ఎనిమిది సంవత్స రాలు పనిచేశారు. ప్రధానంగా చిన్నా రులపై జరిగే హింసకు సంబంధించిన కేసులను విచారించారు.
  • కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పని చేస్తున్నప్పుడు బరాక్ ఒబామా దృష్టిలో పడ్డారు. అనంతరం డెమొక్రటిక్ పార్టీలో చేరారు. కాలిఫోర్నియా సెనేటర్‌గా ఎన్నికయ్యారు.
  • శాన్‌ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీ పదవిని అధిరోహించిన తొలి మహిళగా ఆమె కీర్తిగడించారు. అలాగే కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా సేవలందించిన మహిళగానూ రికార్డుకెక్కారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టనున్న తొలి మహిళ
ఎప్పుడు : నవంబర్ 7
ఎవరు : డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా దేవి హ్యారిస్
ఎందుకు : అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2020లో డెమొక్రాటిక్ పార్టీ విజయం సాధించడంతో
Published date : 09 Nov 2020 05:53PM

Photo Stories