అమెరికా టెన్నిస్ స్టార్ స్పియర్స్‌పై ఐటీఎఫ్ నిషేధం
Sakshi Education
డోపింగ్‌లో పట్టుబడినందుకు అమెరికాకు చెందిన మహిళల టెన్నిస్ డబుల్స్ స్టార్ ప్లేయర్ అబిగెయిల్ స్పియర్స్‌పై అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) 22 నెలలపాటు నిషేధం విధించింది.
2019 యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ సందర్భంగా స్పియర్స్‌కు నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో ఆమె నిషేధిత ఉత్ప్రేరకాలు ప్రాస్టీరోన్, టెస్టోస్టిరాన్ వాడినట్లు తేలింది. డోపింగ్ ఫలితాలు వచ్చిన తేదీ 2019 నవంబర్ 7 నుంచి నిషేధం అమలవుతుందని 2021, ఏడాది సెప్టెంబర్ 6 వరకు కొనసాగుతుందని ఐటీఎఫ్ ఫిబ్రవరి 6న తెలిపింది.
21 డబుల్స్ టైటిల్స్..
స్పియర్స్ తన కెరీర్‌లో 21 డబుల్స్ టైటిల్స్ గెలిచింది. 2017 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కొలంబియా ప్లేయర్ యువాన్ సెబాస్టియన్ కబాల్‌తో జతగా స్పియర్స్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచింది. 2013, 2014 యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల ఫైనల్స్‌లో స్పియర్స్ ఓడిపోయి రన్నరప్ ట్రోఫీ సాధించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికాకు మహిళల టెన్నిస్ డబుల్స్ స్టార్ ప్లేయర్ అబిగెయిల్ స్పియర్స్‌పై నిషేధం
ఎప్పుడు : ఫిబ్రవరి 6
ఎవరు : అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్)
ఎందుకు : డోపింగ్ పరీక్షల్లో విఫలమైనందున

Published date : 07 Feb 2020 05:46PM