Skip to main content

అమెరికా కవయిత్రికి సాహిత్య రంగంలో నోబెల్

తన కవితలతో ఎంతోమందిని ప్రభావితం చేసిన అమెరికాకు చెందిన కవయిత్రి లూయిస్ గ్లక్‌కు 2020 ఏడాది సాహితీ నోబెల్ పురస్కారం లభించింది.
Current Affairsరాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ అక్టోబర్ 8న స్టాక్‌హోమ్‌లో ఈ విషయాన్ని ప్రకటించింది. 1943, ఏప్రిల్ 22న అమెరికాలోని న్యూయార్క్‌లో జన్మించిన 77 ఏళ్ల గ్లక్.. కనెక్టికట్‌లోని యాలే యూనివర్శిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. 1968లో ఫస్ట్‌బార్న్ పేరుతో తొలి కవిత రాసిన ఆమె కొద్ది కాలంలో అమెరికా సాహిత్యరంగంలో ప్రముఖ కవయిత్రిగా పేరుగాంచారు. ది వైల్డ్ ఐరిష్ కవితకు 1993లో పులిట్జర్ అవార్డును అందుకున్నారు. అలాగే నేషనల్ బుక్ అవార్డ్ వంటి ఎన్నో పురస్కారాలు పొందారు.

2019లో పీటర్ హండ్కేకి...
ఆస్టియ్రాకి చెందిన ప్రముఖ నవల, నాటక రచయిత పీటర్ హండ్కేకి 2019 సంవత్సరానికి గాను సాహిత్య రంగంలో నోబెల్ పురస్కారం వరించింది. 2018 సంవత్సరానికి పోలండ్‌కి చెందిన ప్రముఖ పర్యావరణ వేత్త, స్త్రీవాది, మేధావి, నవలా రచయిత్రి ఓల్గా టోర్కార్క్విజ్‌కి ‘ద బుక్స్ ఆఫ్ జాకోబ్‌‘ అనే నవలకు గానూ సాహితీ బహుమతి లభించింది. 1991 నుంచి ఇప్పటివరకు సాహిత్య రంగంలో 117 మంది నోబెల్ ఇవ్వగా.. వీరిలో మహిళలు 16 మంది ఉన్నారు.
Published date : 08 Oct 2020 05:57PM

Photo Stories