అమెరికా ఎన్నవ అధ్యక్షుడిగా జో బెడైన్ ప్రమాణ స్వీకారం చేశారు?
అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో ఉన్న క్యాపిటల్ భవనంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. బెడైన్‌తో అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్‌ట్స ప్రమాణం చేయించారు. దీంతో అమెరికా చరిత్రలోనే అతిపెద్ద వయస్కుడైన అధ్యక్షుడిగా 78 ఏళ్ల బెడైన్ రికార్డు నెలకొల్పారు. కోవిడ్-19 ముప్పు నేపథ్యంలో కొంత మంది సమక్షంలోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. బెడైన్ ప్రమాణ స్వీకారానికి డొనాల్డ్ ట్రంప్ హాజరు కాలేదు.
ఉపాధ్యక్షురాలిగా కమల...
అధ్యక్షుడుగా బెడైన్ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు... అమెరికా 49వ ఉపాధ్యక్షురాలిగా ఇండో-ఆఫ్రో అమెరికన్ మహిళ కమల హ్యారిస్ ప్రమాణ స్వీకారం చేశారు. కమలతో అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి సోనియా సోటోమేయర్ ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో అమెరికా ఉపాధ్యక్ష పదవి చేపట్టిన తొలి మహిళగా, తొలి నల్లజాతి మహిళగా, తొలి ఇండో-అమెరికన్‌గా, తొలి ఆఫ్రికన్-అమెరికన్‌గా, తొలి ఆసియా-అమెరికన్ మహిళగా 56 ఏళ్ల కమల రికార్డు నెలకొల్పారు.
చదవండి: కమల తల్లి శ్యామలా గోపాలన్ ఏ భారత రాష్ట్రానికి చెందినవారు?
బెడైన్ ప్రస్థానం...
- జో బెడైన్ 1942లో పెన్సిల్వేనియాలో ఓ క్యాథలిక్ కుటుంబంలో జన్మించారు.
- యూనివర్సిటీ ఆఫ్ డెలావర్‌లో చదివారు.
- 1968లో సైరకాస్ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు.
- మొదటిసారిగా 1972లో డెలావర్ రాష్ట్ర సెనేటర్‌గా ఎన్నికయ్యారు. అప్పుడాయన వయసు 29 సంవత్సరాలు.
- దేశంలో పిన్నవయస్కుడైన సెనేటర్‌గా గుర్తింపు పొందారు.
- సెనేట్‌లో అత్యంత తక్కువ ఆస్తులు కలిగిన సెనేటర్‌గా కూడా అప్పట్లో పేరుగాంచారు. మొత్తం ఆరుసార్లు సెనేటర్‌గా ఎన్నికయ్యారు.
- 1972లో జరిగిన కారు ప్రమాదంలో బెడైన్ మొదటి భార్య చనిపోయారు. 1977లో జిల్ జాకబ్స్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు.
- బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బెడైన్ రెండు పర్యాయాలు ఉపాధ్యక్షుడిగా సేవలందించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : యూనెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం
ఎప్పుడు : జనవరి 20
ఎవరు : జోసెఫ్ రాబినెట్ బెడైన్ జూనియర్(జో బెడైన్)
ఎక్కడ : క్యాపిటల్ భవనం, వాషింగ్టన్, అమెరికా