అమెరికా అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ
Sakshi Education
ఐక్యరాజ్యసమితి సమావేశాల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.
అమెరికాలోని న్యూయార్క్‌లో సెప్టెంబర్ 24న జరిగిన ఈ సమావేశంలో వాణిజ్యం, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం వంటి అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ... భారత్- అమెరికాల మధ్య ఆర్థిక సంబంధాల బలోపేతానికి త్వరలోనే వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నామన్నారు. కశ్మీర్ సమస్య పరిష్కారంలో భారత్, పాక్ ప్రధానులిద్దరూ కలిసి ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. ఈ విషయమై మోదీ స్పందిస్తూ.. పాక్‌తో చర్చలు జరపాలంటే ముందుగా ఆ దేశం నిర్ధిష్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా మోదీ ఆయనకు హౌడీ మోదీ కార్యక్రమం ఫొటోను బహూకరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ
ఎప్పుడు : సెప్టెంబర్ 24
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ
ఎప్పుడు : సెప్టెంబర్ 24
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా
Published date : 25 Sep 2019 05:46PM