Skip to main content

ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్ గా ఎవరు వ్యవహరిస్తారు?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి సంస్థ (ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్‌ అథారిటీ) ఏర్పాటైంది.
Current Affairs
దీనితోపాటు ఎగ్జిక్యూటివ్, టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీలను, జిల్లా స్థాయి అమలు కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ఈ మేరకు వ్యవసాయ, పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మార్చి 10న ఉత్తర్వులు జారీ చేశారు.

చైర్మన్‌గా ముఖ్యమంత్రి...
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం... ఆక్వాకల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌గా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వ్యవహరిస్తారు. జిల్లా స్థాయి అమలు కమిటీకి కలెక్టర్‌ చైర్మన్‌గా, జిల్లా మత్స్యశాఖాధికారి మెంబర్‌ సెక్రటరీగా వ్యవహరిస్తారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆక్వాకల్చర్‌ అభివృద్ధి సంస్థ (ఏపీ స్టేట్‌ ఆక్వాకల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) ఏర్పాటు
ఎప్పుడు : మార్చి 10
ఎవరు : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆక్వాకల్చర్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు
Published date : 11 Mar 2021 05:37PM

Photo Stories