Skip to main content

అక్టోబర్ 15 నుంచి రైతు భరోసా

రైతులకు పెట్టుబడిసాయం అందించేందకు ఉద్దేశించిన వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని 2019, అక్టోబర్ 15 నుంచి అమలుచేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో భాగంగా జూన్ 18న ఆయన శాసనసభలో ఈ మేరకు మాట్లాడారు. రైతు భరోసా ద్వారా ఏటా రూ.12,500 చొప్పున రైతులకు ఇస్తామని తెలిపారు. వచ్చే ఉగాది నాటికి 25,00,000 ఇళ్ల పట్టాలు జారీ చేస్తామన్నారు. అలాగే పలు పథకాల అమలు తేదీలను కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు.

పథకం

అమలు తేదీ

27 శాతం ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి

జూలై 1

గ్రామ వలంటీర్ల వ్యవస్థ

ఆగస్టు 15

ప్రభుత్వ పథకాల డోర్ డెలివరీ

సెప్టెంబర్ 1

గ్రామ సచివాలయ వ్యవస్థ

అక్టోబర్ 2

అమ్మఒడి(రూ.15000)

జనవరి 26


క్విక్ రివ్యూ :
ఏమిటి :
అక్టోబర్ 15 నుంచి వైఎస్సార్ రైతు భరోసా
ఎప్పుడు : జూన్ 18
ఎవరు : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు : రైతులకు పెట్టుబడిసాయం అందించేందుకు
Published date : 19 Jun 2019 06:15PM

Photo Stories