Skip to main content

అక్షయపాత్ర మోడ్రన్ కిచెన్ ప్రారంభం

శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం పంచాయతీ కేజీబీవీ పాఠశాల సమీపంలో నిర్మించిన అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ మోడ్రన్ కిచెన్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సెప్టెంబర్ 6న ప్రారంభించారు.
అనంతరం అక్షయపాత్ర వాహనాలను సీఎం జెండా ఊపి ప్రారంభించారు. ముఖ్యమంత్రి శ్రీకాకుళం పర్యటన సందర్భంగా పలాసలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ఏడాది క్రితం తిత్లీ తుపాన్‌లో తీవ్రంగా నష్టపోయిన ఉద్దాన రైతులకు పెంచిన పరిహారం రూ.150 కోట్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ చేపట్టారు. కొబ్బరి చెట్టుకు పరిహారాన్ని రూ.1,500 నుంచి రూ.3 వేలకు పెంచి చెక్కు రూపంలో అందించారు. హెక్టారు జీడి తోటలకు రూ.30 వేల నుంచి రూ.50 వేలకు పెంచిన పరిహారం అందజేశారు. 9 మంది తిత్లీ బాధితులకు చెక్కులను అందజేశారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ మోడ్రన్ కిచెన్ ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 6
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : కేజీబీవీ పాఠశాల సమీపం, సింగుపురం పంచాయతీ, శ్రీకాకుళం రూరల్ మండలం, ఆంధ్రప్రదేశ్
Published date : 10 Sep 2019 08:25PM

Photo Stories