ఆక్స్‌ఫర్డ్ టీకా ప్రయోగాలకు విరామం
Sakshi Education
కరోనా చికిత్స కోసం అ్ట్రాజెనెకాతో కలిసి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ రూపొందిస్తున్న ChAdOx1 nCoV&19 వ్యాక్సిన్ ప్రయోగాల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయి.
దీంతో టీకా ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు బ్రిటన్‌లోని ఆరోగ్య వెబ్‌సైట్ స్టాట్‌న్యూస్ సెప్టెంబర్ 9న వెల్లడించింది. ఈ టీకా తొలి రెండు దశల మానవ ప్రయోగాలు పూర్తయ్యాయి. అమెరికా, యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలో దాదాపు 30 వేల మందిపై మూడో దశ ప్రయోగాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ప్రయోగాల్లో పాల్గొన్న ఒక వ్యక్తి ఆరోగ్యం క్షీణించడంతో టీకా ప్రయోగాలను నిలిపివేశారు. భారత్‌లోని సీరమ్ ఇనిస్టిట్యూట్ 100 కోట్ల ఆక్స్‌ఫర్డ్ టీకాలను ఉత్పత్తి చేయడానికి అస్ట్రాజెనెకాతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.
ప్లాస్మా.. పని చేయట్లేదు
కోవిడ్ వైద్యంలో భాగంగాచేసే ప్లాస్మా చికిత్స పెద్దగా ప్రభావం చూపలేదని భారతీయ వైద్య పరిశోధనా సంస్థ (ఐసీఎంఆర్) సెప్టెంబర్ 9న తెలిపింది. మరణాల రేటును తగ్గించడంలో గానీ, కోవిడ్ తీవ్రతను తగ్గించడంలోగానీ ప్లాస్మా ప్రభావం చూపలేకపోయిందని పేర్కొంది.ప్లాస్మా.. పని చేయట్లేదు
Published date : 10 Sep 2020 05:20PM