అకాంకాగ్వాను అధిరోహించిన చిన్న వయస్కురాలు
Sakshi Education
ముంబైలోని నావికాదళ స్కూల్ విద్యార్థిని, 12 ఏళ్ల కామ్య కార్తికేయన్ దక్షిణ అమెరికాలోని ఎత్తైన పర్వతం మౌంట్ అకాంకాగ్వా(6,962మీ)ను ఫిబ్రవరి 1న విజయవంతంగా అధిరోహించింది.
దీంతో అకాంకాగ్వా పర్వతాన్ని అధిరోహించిన అత్యంత చిన్న వయస్కురాలిగా కామ్య ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్న కామ్య అకాంకాగ్వా పర్వత శిఖరాగ్రంపై భారత జాతీయ పతకాన్ని ఎగరవేసిందని నేవీ అధికారులు వెల్లడించారు. అకాంకాగ్వా పర్వతం అర్జెంటీనాలో ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అకాంకాగ్వాను అధిరోహించిన అత్యంత చిన్న వయస్కురాలు
ఎప్పుడు : ఫిబ్రవరి 1
ఎవరు : కామ్య కార్తికేయన్
ఎక్కడ : అర్జెంటీనా, దక్షిణ అమెరికా
క్విక్ రివ్యూ :
ఏమిటి : అకాంకాగ్వాను అధిరోహించిన అత్యంత చిన్న వయస్కురాలు
ఎప్పుడు : ఫిబ్రవరి 1
ఎవరు : కామ్య కార్తికేయన్
ఎక్కడ : అర్జెంటీనా, దక్షిణ అమెరికా
Published date : 11 Feb 2020 05:38PM