Skip to main content

అజర్‌బైజాన్‌ గ్రాండ్‌ప్రి రేసులో విజేత నిలిచిన డ్రైవర్?

అజర్‌బైజాన్‌ గ్రాండ్‌ప్రి రేసులో రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ సెర్గియో పెరెజ్‌ విజేతగా నిలిచాడు.
Current Affairs అజర్‌బైజాన్‌ రాజధాని బాకు నగర వీధుల్లో జూన్ 6న జరిగిన 51 ల్యాప్‌ల రేసులో పెరెజ్‌ అందరికంటే ముందుగా 2 గంటల 13 నిమిషాల 36.410 సెకన్లలో లక్ష్యానికి చేరి విజేతగా నిలిచాడు. ఈ సీజన్‌లో పెరెజ్‌కిది తొలి విజయం కాగా కెరీర్‌లో రెండోది. ప్రపంచ మాజీ చాంపియన్‌ సెబాస్టియన్‌ వెటెల్‌ (ఆస్టన్‌ మార్టిన్‌) రెండో స్థానంలో... పియరీగ్యాస్లీ (ఆల్ఫా టారీ) మూడో స్థానంలో నిలిచారు. సీజన్‌లోని తదుపరి రేసు ఫ్రాన్స్‌ గ్రాండ్‌ప్రి జూన్ 20న జరుగుతుంది.

రెజ్లర్‌ సుమిత్‌పై నిషేధం...
భారత హెవీవెయిట్‌ రెజ్లర్, టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌ దక్కించుకున్న సుమిత్‌ మలిక్‌ (125 కేజీలు) డోపింగ్‌ పరీక్షలో విఫలమయ్యాడు. యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ (యూడబ్ల్యూడబ్ల్యూ) ఆధ్వర్యంలో జరిగిన వరల్డ్‌ ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో సుమిత్‌ డోపింగ్‌లోపట్టుబడటంతో అతనిపై తాత్కాలికంగా ఆరు నెలలపాటు నిషేధం విధించారు. దాంతో సుమిత్‌ టోక్యో ఒలింపిక్స్‌కు దూరమయ్యాడు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : అజర్‌బైజాన్‌ గ్రాండ్‌ప్రి రేసులో విజేత నిలిచిన డ్రైవర్?
ఎప్పుడు : జూన్ 6
ఎవరు : రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ సెర్గియో పెరెజ్‌
ఎక్కడ : బాగు, అజర్‌బైజాన్‌
Published date : 07 Jun 2021 07:33PM

Photo Stories