Skip to main content

ఐటీడీఏల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం

ఆంధ్రప్రదేశ్‌లోని ఎనిమిది జిల్లాల్లో ఉన్న ఏడు ఐటీడీఏలు, 77 షెడ్యూల్డ్, గిరిజన మండలాల్లో ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం’ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Current Affairsఈ మేరకు పథకం అమలుకు ఆంధ్రప్రదేశ్ మహిళా స్త్రీ శిశు సంక్షేమశాఖ నవంబర్ 26న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం ద్వారా గిరిజన ప్రాంతాల్లో పోషకాహార లోపం, రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అదనపు పోషకాహారం అందిస్తారు. ఈ కార్యక్రమం అమలుకు ప్రభుత్వం రూ.42.71 కోట్లు విడుదల చేసింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం అమలు
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు ఐటీడీఏలు, 77 షెడ్యూల్డ్, గిరిజన మండ లాలు
ఎందుకు : చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అదనపు పోషకాహారం అందించేందుకు
Published date : 27 Nov 2019 05:36PM

Photo Stories