ఐసీసీ టెస్టు క్రికెట్‌లో ఉత్తమ జట్టుగా భారత్
Sakshi Education
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పురుషుల టెస్టు క్రికెట్‌లో ఉత్తమ జట్టుగా వరుసగా మూడోసారి భారత క్రికెట్ జట్టు నిలిచింది.
ఐసీసీ కటాఫ్ తేదీ ఏప్రిల్ 1నాటికి విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు 116 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. భారత్ తర్వాత న్యూజిలాండ్(108) రెండో స్థానంలో నిలవగా, దక్షిణాఫ్రికా(105) మూడోస్థానం, ఆస్ట్రేలియా(104) నాలుగో స్థానం దక్కించుకున్నాయి. ఐసీసీ టెస్టు క్రికె ట్‌లో ఉత్తమ జట్టుగా నిలిచిన జట్టుకు 10 లక్షల డాలర్ల బహుమతితో పాటు ప్రత్యేక గదను అందజేస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐసీసీ టెస్టు క్రికెట్‌లో ఉత్తమ జట్టు
ఎప్పుడు : ఏప్రిల్ 1
ఎవరు : భారత జట్టు
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐసీసీ టెస్టు క్రికెట్‌లో ఉత్తమ జట్టు
ఎప్పుడు : ఏప్రిల్ 1
ఎవరు : భారత జట్టు
Published date : 02 Apr 2019 06:18PM