Skip to main content

ఐసీసీ మహిళల టాప్ ర్యాంకర్లు వీరే..

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించిన మహిళల వ్యక్తిగత వన్డే ర్యాంకింగ్‌‌సలో భారత్‌కు నిరాశ ఎదురైంది.
‘టాప్’లో ఉన్న స్మృతి మంధాన రెండో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం స్మృతి 755 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా... 759 పాయింట్లతో న్యూజిలాండ్ ప్లేయర్ అమీ సాటర్త్‌వెయిట్ మొదటి ర్యాంక్‌కు ఎగబాకింది. క్రికెట్ కెరీర్‌లో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సారథి మిథాలీ రాజ్ ఒక స్థానాన్ని కోల్పోయి ఏడో ర్యాంక్‌కు పరిమితం కాగా... టి20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని 17వ స్థానంలో నిలిచింది. బౌలింగ్‌లో జులన్ గోస్వామి, శిఖా పాండే, పూనమ్ యాదవ్‌లు ర్యాంకింగ్‌‌సలో కిందికి పడిపోయి వరుసగా 6, 8, 9వ స్థానాల్లో నిలిచారు. ఆల్‌రౌండర్ విభాగంలో దీప్తి శర్మ మూడో స్థానానికి పడిపోయింది.

క్విక్ రివ్యూ:
ఏమిటి:
ఐసీసీ మహిళల వ్యక్తిగత వన్డే ర్యాంకింగ్స్ విడుదల
ఎప్పుడు: అక్టోబర్ 15, 2019
ఎక్కడ : దుబాయ్
Published date : 16 Oct 2019 05:27PM

Photo Stories