Skip to main content

ఐసీఐసీఐ బ్యాంక్ రేటింగ్ డౌన్‌గ్రేడ్

ఐసీఐసీఐ బ్యాంకు రేటింగ్‌ను అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ ఒక అంచె డౌన్‌గ్రేడ్ చేసింది.
దీర్ఘకాలిక ఇష్యూయర్ డిఫాల్ట్ రేటింగ్ (ఐడీఆర్) ‘BBB’ నుంచి ‘BB+’కి తగ్గించినట్లు వెల్లడించింది. అలాగే లాభదాయకత రేటింగ్‌ను ‘bbb-’ నుంచి ‘bb+’కి మార్చింది. ఐడీఆర్ భవిష్యత్ అంచనాలను స్థిరంగా కొనసాగిస్తున్నట్లు ఫిచ్ పేర్కొంది. రుణాల చెల్లింపులో మెరుగైన సామర్థ్యాలను BBB రేటింగ్ సూచిస్తుంది. మరోవైపు BB రేటింగ్.. స్పెక్యులేటివ్ ధోరణిని సూచిస్తుంది. ఇక దేశీ బ్యాంకింగ్ రంగం పనితీరు అంచనాలను ‘bbb-’ నుంచి ‘bb+’కి తగ్గిస్తున్నట్లు ఫిచ్ తెలిపింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఐసీఐసీఐ బ్యాంక్ రేటింగ్ డౌన్‌గ్రేడ్
ఎప్పుడు : జూన్ 3
ఎవరు : అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్
Published date : 04 Jun 2019 05:42PM

Photo Stories