Skip to main content

ఐరాస నివేదిక ప్రకారం 2030 నాటికి మొత్తం నిరుపేదల సంఖ్య?

కరోనా వైరస్ దీర్ఘకాలంగా కొనసాగుతూ ఆర్థిక రంగంపై తీవ్రంగా చూపిస్తున్న ప్రభావం వల్ల... 2030 నాటికి అదనంగా మరో 20.7 కోట్ల మంది దుర్భర దారిద్య్రంలోకి పడిపోనున్నారు.
Current Affairs
వీరిలో మహిళల సంఖ్య 10.2 కోట్లు ఉంటుంది. దీంతో 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం నిరుపేదల సంఖ్య 100 కోట్లు దాటిపోనుంది. డిసెంబర్ 6న ఐక్యరాజ్యసమితి డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్‌డీపీ) విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

పెట్టుబడుల్ని పెంచితే...
ప్రపంచ దేశాలన్ని కలసికట్టుగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు డిజిటలైజేషన్, సంక్షేమ పథకాలు, సామాజిక భద్రత రంగాల్లో పెట్టుబడుల్ని పెంచితే 14.6 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకి తీసుకురావచ్చునని యూఎన్‌డీపీ నివేదిక తెలిపింది. వచ్చే పదేళ్లలో 4.4 కోట్ల మంది దారిద్య్రరేఖ దిగువకు వెళతారని గతంలో ఐఎంఎఫ్ అంచనా వేసిన విషయం తెలిసిందే.

క్విక్ రివ్యూ :

ఏమిటి : 2030 నాటికి మొత్తం నిరుపేదల సంఖ్య 100 కోట్లుదాటిపోనుంది
ఎప్పుడు : డిసెంబర్ 6
ఎవరు : ఐక్యరాజ్యసమితి డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్‌డీపీ)
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
ఎందుకు : కరోనా వైరస్ దీర్ఘకాలంగా కొనసాగుతూ ఆర్థిక రంగంపై తీవ్రంగా చూపిస్తున్న ప్రభావం వల్ల...
Published date : 07 Dec 2020 05:34PM

Photo Stories