Skip to main content

ఐక్యరాజ్యసమితి తొలి ఆన్‌లైన్ సమావేశం ప్రారంభం

కోవిడ్-19 నేపథ్యంలో ప్రధాన దేశాధినేతల ముందుగా రికార్డు చేసిన ఉపన్యాసాలతో ఐక్యరాజ్యసమితి ప్రపంచాధినేతల తొలి ఆన్‌లైన్ సమావేశం సెప్టెంబర్ 22న ప్రారంభమైంది. 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 21న ప్రారంభ సమావేశం జరిగింది.
Edu news193 సభ్య దేశాల ఉపన్యాసాలు ప్రారంభం అయ్యారుు. సమావేశాల సందర్భంగా ఐరాస జనరల్ అసెంబ్లీ సభ్యదేశాలన్నీ కలిపి ఒక తీర్మానాన్ని విడుదల చేశాయి. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరముందని, మరింత ఎక్కువ దేశాలకు, ప్రభుత్వాలకు భాగస్వామ్యం కల్పించేలా ఐరాసలో సంస్కరణలు తీసుకురావాల్సి ఉందని ఈ తీర్మానం పేర్కొంది. కోవిడ్-19 లాంటి సమస్యలను ఎదుర్కొనేందుకు సన్నద్ధతతో ఉండాలని తెలిపింది.

మోదీ ప్రసంగం...
ఐరాస 75వ వార్షికోత్సవ సమావేశాన్ని ఉద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ... ఐరాసలో మరింత మందికి ప్రాతినిధ్యం కల్పించేలా సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కాలపు సవాళ్లను ఎదుర్కొనేందుకు పురాతన కాలం నాటి వ్యవస్థలు ఉపయోగపడవని తెలిపారు. సమగ్రమైన సంస్కరణలు తీసుకురాకపోతే ఐరాస వ్యవస్థ విశ్వసనీయత సంక్షోభంలో పడుతుందని పేర్కొన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఐక్యరాజ్యసమితి తొలి ఆన్‌లైన్ సమావేశం ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 22
ఎందుకు : ఐక్యరాజ్యసమితి 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని
Published date : 23 Sep 2020 06:34PM

Photo Stories