ఐక్యరాజ్యసమితి ఏసీఏబీక్యూకి ఎంపికైన భారతీయురాలు?
Sakshi Education
ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అనుబంధ సంస్థ అడ్వైజరీ కమిటీ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ బడ్జెటరీ క్వశ్చన్స్(ఏసీఏబీక్యూ) సభ్యురాలిగా భారత్‌కి చెందిన దౌత్యవేత్త విదీషా మైత్రా ఎన్నికయ్యారు.
ఆసియా పసిపిక్ దేశాల గ్రూపు నుంచి మైత్రా 126 ఓట్లు సాధించి, గెలుపొందారు. జనవరి 1, 2021 నుంచి మూడేళ్ళపాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. వ్యక్తిగత అర్హతలు, అనుభవం, విశాల ప్రాంతాల ప్రాతినిధ్యం ఆధారంగా అడ్వైజరీ కమిటీకి 193 సభ్య దేశాల జనరల్ అసెంబ్లీ సభ్యులను నియమిస్తుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అడ్వైజరీ కమిటీ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ బడ్జెటరీ క్వశ్చన్స్(ఏసీఏబీక్యూ)కు ఎంపిక
ఎప్పుడు : నవంబర్ 7
ఎవరు : దౌత్యవేత్త విదీషా మైత్రా
క్విక్ రివ్యూ :
ఏమిటి : అడ్వైజరీ కమిటీ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ బడ్జెటరీ క్వశ్చన్స్(ఏసీఏబీక్యూ)కు ఎంపిక
ఎప్పుడు : నవంబర్ 7
ఎవరు : దౌత్యవేత్త విదీషా మైత్రా
Published date : 09 Nov 2020 06:05PM