ఐక్యరాజ్యసమితి అవార్డు గెలుచుకున్న జాతీయ సంస్థ?
Sakshi Education
భారత్‌లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఏర్పాటైన జాతీయ సంస్థ ‘ఇన్వెస్ట్ ఇండియా’ ప్రతిష్టాత్మక అవార్డు... ‘‘ఐక్యరాజ్యసమితి పెట్టుబడుల ప్రోత్సాహక పురస్కారం-2020’’ను గెలుచుకుంది.
స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉన్న యునెటైడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ (యూఎన్‌సీటీఏడీ) ప్రధాన కార్యాలయంలో డిసెంబర్ 7న అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. పెట్టుబడులను ప్రోత్సహించేందుకు వివిధ దేశాల ఇన్వెస్ట్‌మెంట్ ఏజెన్సీలు చేస్తున్న కృషికి గుర్తింపుగా యూఎన్‌సీటీఏడీ ఈ అవార్డును అందిస్తోంది. సుమారు 180 ప్రభుత్వ ఏజెన్సీలు ఈసారి బరిలో నిలవగా ఇన్వెస్ట్ ఇండియా విజేతగా నిలిచింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐక్యరాజ్యసమితి పెట్టుబడుల ప్రోత్సాహక పురస్కారం-2020 విజేత
ఎప్పుడు : డిసెంబర్ 7
ఎవరు : ఇన్వెస్ట్ ఇండియా
ఎక్కడ : జెనీవా, స్విట్జర్లాండ్
ఎందుకు : పెట్టుబడులను ప్రోత్సహించడంలో విశేష కృషి చేసినందుకుగాను
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐక్యరాజ్యసమితి పెట్టుబడుల ప్రోత్సాహక పురస్కారం-2020 విజేత
ఎప్పుడు : డిసెంబర్ 7
ఎవరు : ఇన్వెస్ట్ ఇండియా
ఎక్కడ : జెనీవా, స్విట్జర్లాండ్
ఎందుకు : పెట్టుబడులను ప్రోత్సహించడంలో విశేష కృషి చేసినందుకుగాను
Published date : 08 Dec 2020 05:27PM