ఐహెచ్‌ఎస్ మార్కిట్ సంస్థను కొనుగోలు చేయనున్న సంస్థ?
Sakshi Education
ఆర్థిక గణాంకాలు అందించే ఐహెచ్‌ఎస్ మార్కిట్ సంస్థను ఎస్ అండ్ పీ గ్లోబల్ కొనుగోలు చేస్తోంది. అంతా షేర్ల లావాదేవీగా జరిగే ఈ ఒప్పందం విలువ 4,400 కోట్ల డాలర్లు (దాదాపు రూ.3.3 లక్షల కోట్లు)గా ఉంది.
ఆర్థిక గణాంకాల సమాచార రంగంలో ఇదే అతిపెద్ద విలీనం. ఈ ఒప్పందంలో భాగంగా ఒక్కో ఐహెచ్‌ఎస్ మార్కిట్ షేర్‌కు 0.2838 ఎస్ అండ్ పీ గ్లోబల్ షేర్ లభిస్తుంది.
2021, జూన్ నాటికి...
విలీన సంస్థ న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ సంస్థకు సీఈఓగా ఎస్ అండ్ పీ గ్లోబల్ ప్రస్తుత సీఈఓ డగ్లస్ పీటర్సన్ వ్యవహరిస్తారు. 2021, జూన్‌కల్లా ఈ లావాదేవీ పూర్తవుతుందని అంచనా. ఎస్ అండ్ పీ సంస్థ కంపెనీలకు, దేశాలకు డెట్ రేటింగ్స్‌ను ప్రకటిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా క్యాపిటల్, కమోడిటీ మార్కెట్లకు సంబంధించిన గణాంకాలను విడుదల చేస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐహెచ్‌ఎస్ మార్కిట్ సంస్థను కొనుగోలు చేయనున్న సంస్థ
ఎప్పుడు : నవంబర్ 30
ఎవరు : ఎస్ అండ్ పీ గ్లోబల్

Published date : 01 Dec 2020 05:46PM