ఐఏసీసీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తెలుగు వ్యక్తి?
Sakshi Education
ఇండో అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐఏసీసీ) జాతీయ అధ్యక్షుడిగా 2020-21 సంవత్సరానికిగాను గ్లోబల్ ఇన్ఫోవిజన్ ఎండీ పూర్ణచంద్రరావు సూరపనేని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
52 ఏళ్ల చరిత్ర కలిగిన ఐఏసీసీకి ఈ పదవిని అలంకరించిన రెండవ తెలుగు వ్యక్తిగా పూర్ణచంద్రరావు నిలిచారు. 2018-20 కాలానికి ఐఏసీసీ జాతీయ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నెరవేర్చారు. భారత్-యూఎస్ వ్యాపార సంబంధాలు, వాణిజ్యం మరింత మెరుగుపడేందుకు ఆయన అనుభవం దోహదం చేస్తుందని ఐఏసీసీ భావిస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండో అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐఏసీసీ) జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక
ఎప్పుడు : సెప్టెంబర్ 30
ఎవరు : గ్లోబల్ ఇన్ఫోవిజన్ ఎండీ పూర్ణచంద్రరావు సూరపనేని
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండో అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐఏసీసీ) జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక
ఎప్పుడు : సెప్టెంబర్ 30
ఎవరు : గ్లోబల్ ఇన్ఫోవిజన్ ఎండీ పూర్ణచంద్రరావు సూరపనేని
Published date : 01 Oct 2020 05:25PM