Skip to main content

ఐఎస్‌ఎస్‌ తలకిందులైంది!

రష్యా ఇటీవల ప్రయోగించిన నౌకా అనే మాడ్యూల్‌ కారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) 45 డిగ్రీల వంపు తిరిగిందని నాసా అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే.
అయితే నాసా చెప్పిన దానికంటే చాలా రెట్లు ఎక్కువగా ఐఎస్‌ఎస్‌ ప్రభావితమైందంటూ తాజా వివరాలు బయటకు వచ్చాయి. మొత్తం 540 డిగ్రీల మేర ఐఎస్‌ఎస్‌ తలకిందులైందని న్యూయార్క్‌ టైమ్స్‌లో ఓ నివేదిక విడుదలైంది. ఇది దాదాపు ఒకటిన్నర రెట్లు పరిభ్రమణానికి సమానం. అయితే దాన్ని తిరిగి సరి చేసినట్లు నాసా తెలిపింది.

కరోనా వైరస్‌ను ల్యాబ్‌లో సృష్టించారు: అమెరికా
చైనాలోని వూహాన్‌ పరిశోధనశాలలో కరోనా వైరస్‌ను కృత్రిమంగా అభివృద్ధిచేశారు అనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయంటూ అమెరికాలోని రిపబ్లికన్లు ఓ నివేదిక విడుదల చేశారు. ‘జీఓపీ పరిశోధన’ పేరుతో ప్రచురితమైన ఈ నివేదిక తాజా సంచలనంగా మారింది. తమ వద్ద ఉన్న ఆధారాల ప్రకారం 2019 సెప్టెంబర్‌ 12 కంటే ముందే కరోనా వైరస్‌ వూహాన్‌ ల్యాబ్‌ నుంచి బయటకు వ్యాపించిందని రిపబ్లికన్లు చెప్పారు.
Published date : 04 Aug 2021 05:54PM

Photo Stories